Page Loader
మాంచెస్టర్ సిటీ చేతిలో బేయర్న్ మ్యూనిచ్ చిత్తు
క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన మాంచెస్టర్ సిటీ

మాంచెస్టర్ సిటీ చేతిలో బేయర్న్ మ్యూనిచ్ చిత్తు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2023
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్ క్వార్టర్-ఫైనల్‌లో మాంచెస్టర్ సిటీ, బేయర్న్ మ్యూనిచ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బేయర్న్ మ్యూనిచ్ ను 3-0తో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. రోడ్రి, బెర్నార్డో, సిల్వా, ఎర్లింగ్ హాలాండ్ సిటీ తరుపున గోల్స్ చేసి సత్తా చాటాడు. బేయర్న్ గ్రూప్ దశలో బార్సిలోనా, ఇంటర్ మిలన్, విక్టోరియా ప్లెజెన్‌లతో సహా ఆరు విజయాలను సాధించింది. రౌండ్ ఆఫ్ 16లో బేయర్న్ 3-0 స్కోరుతో పారిస్ సెయింట్-జర్మైన్‌ను ఓడించింది. గోల్‌కి 30 గజాల దూరంలో సిల్వా పాస్‌ను అందుకున్న తర్వాత రోడ్రి గోల్ చేయడంతో సిటీ మొదటి అర్ధభాగంలో అద్భుతంగా రాణించింది.

హాలాండ్

హాలాండ్ సాధించిన రికార్డులివే

ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్‌లో హాలాండ్ 11 గోల్స్‌ చేశాడు. హాలాండ్ ప్రస్తుతం ఈ సీజన్‌లో అన్ని పోటీలలో సిటీ తరపున 45 గోల్స్‌ చేయడం విశేషం. అతను రూడ్ వాన్ నిస్టెల్‌రూయ్, మొహమ్మద్ సలా రికార్డును అధిగమించాడు. ఛాంపియన్స్ లీగ్‌లో తన 26వ మ్యాచ్‌ను ఆడుతున్న హాలాండ్ 34 గోల్స్‌కి చేరుకున్నాడు. అతను బేయర్న్ తరపున 35 గేమ్‌లలో 34 గోల్స్ చేసి, గెర్డ్ ముల్లర్ స్కోరును సమం చేశాడు. యూరోపియన్ క్లబ్ ఫుట్‌బాల్‌లో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. సిటీ ఛాంపియన్స్ లీగ్‌లో ప్రీమియర్ లీగ్ క్లబ్‌లో 25 మ్యాచ్‌ల్లో 23 గెలిచింది.