యూరోపా లీగ్‌లో రియల్ బెటిస్‌ను మట్టికరిపించిన మాంచెస్టర్ యునైటెడ్
యూరోపా లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. రియల్ బెటిస్‌ను 4-1తో మాంచెస్టర్ యునైటెడ్ మట్టికరిపించింది. లివర్‌పూల్ చేతిలో 7-0తో ఓడిపోయిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ పుంజుకొని విజృంభించింది. మార్కస్ రాష్‌ఫోర్డ్ యునైటెడ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. రెండవ అర్ధభాగంలో, ఆంటోనీ, బ్రూనో ఫెర్నాండెజ్, వౌట్ వెఘోర్స్ట్ చేసిన గోల్స్ యునైటెడ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్‌లో రాష్‌ఫోర్డ్ 26 గోల్స్ చేసి మూడోస్థానంలో నిలిచాడు. అంతకుముందు ఎర్లింగ్ హాలాండ్ (33), కైలియన్ ఎంబాప్పే (30) అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు.
ఫెర్నాండెజ్ సాధించిన రికార్డులివే
2022-23 సీజన్‌లో ఫెర్నాండెజ్ అన్ని పోటీల్లో ఎనిమిది గోల్స్ చేసి, 10 అసిస్ట్‌లను సత్తా చాటాడు. MUFC కోసం 167 మ్యాచ్‌లలో ఫెర్నాండెజ్ 58 గోల్స్, 49 అసిస్ట్‌లు సాధించాడు. ఈ సీజన్‌లో యునైటెడ్ తరుపున ఆంటోనీ తన 7వ గోల్‌ని సాధించాడు. యునైటెడ్ 25 సార్లు ప్రయత్నింగా.. 13 సార్లు లక్ష్యానికి చేరుకుంది. బెటిస్ ఆరుసార్లు ప్రయత్నించగా.. రెండు సార్లు లక్ష్యానికి చేరుకుంది. యునైటెడ్ 57శాతం బంతిని కలిగి ఉండి.. 81శాతం ఖచ్చితత్వాన్ని సాధించింది. లివర్‌పూల్‌పై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 7-0తో ఘోర పరాజయానికి యునైటెడ్ తిరిగి విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకుంది.