Page Loader
ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ పరాజయం
సంబరాలు చేసుకుంటున్న లివర్ పూల్ జట్టులోని సభ్యులు

ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ పరాజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2023
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ చెత్త ప్రదర్శనతో ఓటమిపాలైంది. 7-0 తేడాతో మాంచెస్టర్ యునైటెడ్ ని లివర్ పూల్ చిత్తు చేసింది. ప్రీమియర్ లీగ్‌లో టాప్ 4 ఆశలను లివర్ పూల్ సజీవంగా ఉంచుకుంది. కోడి గక్పో, డార్విన్ నునెజ్, మొహమ్మద్ సలా అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు. లివర్‌పూల్‌కి మొదటి ప్రయత్నంలో గాస్కో ఆధిక్యాన్ని అందించాడు. సలా, గాస్కో 50వ నిమిషంలో మరోసారి గోల్ చేయడంతో లివర్ పూల్ మరోసారి అధిక్యాన్ని సాధించింది. రాబర్టో ఫిర్మినో బెంచ్ జట్టుకు ఏడో గోల్ ను అందించి సత్తా చాటాడు. లివర్‌పూల్ కోసం రికార్డు స్థాయిలో 129వ ప్రీమియర్ లీగ్ గోల్‌ని సలా సాధించాడు.

మాంచెస్టర్ యునైటెడ్

టైటిల్ రేసు నుండి నిష్ర్కమించిన లీడర్స్

ఏప్రిల్ 2022లో ఆన్‌ఫీల్డ్‌లో లివర్‌పూల్ మాంచెస్టర్ యునైటెడ్‌ను 4-0తో ఓడించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్ ఓటమిపై మాజీ డిఫెండర్ గ్యారీ నెవిల్లే స్పందించారు. ఈ ఓటమి చాలా అవమానంగా ఉందని వాపోయాడు. 7-0 తేడాతో ఓడిపోవడం చాలా బాధగా ఉందని, ఇలాంటి ఓటములతో జట్టులోని సభ్యులు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉందని తెలిపారు. యునైటెడ్ 49 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. లీడర్స్ ఆర్సెనల్ కంటే 14 పాయింట్లు వెనుకబడి టైటిల్ రేసు నుండి నిష్క్రమించింది. లివర్ పూల్ టోటెన్‌హామ్ కంటే కేవలం మూడు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది.