IPL 2025: ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్లతో మీటింగ్ ఫిక్స్ చేసిన BCCI...
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభానికి ముందు, అన్ని10 ఫ్రాంచైజీల కెప్టెన్లు,మేనేజర్ల కోసం ప్రత్యేక సమావేశానికి ఆహ్వాన పత్రాలు పంపించింది.
ఈ సమావేశం మార్చి 20న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరగనుంది.
సాధారణంగా, సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్ల సమావేశం మొదటి మ్యాచ్ నిర్వహించే ప్రదేశంలో జరుగుతుంది.
అయితే, ఈసారి BCCI తమ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశంలో కెప్టెన్లు, మేనేజర్లు కొత్త సీజన్‌కు సంబంధించిన మార్పులు, నియమాలపై సమగ్ర వివరాలు తెలుసుకుంటారు.
అనంతరం, స్పాన్సర్ కార్యక్రమాలు,కెప్టెన్ల ఫోటోషూట్‌లు ముంబైలోని తాజ్ హోటల్‌లో నిర్వహించనున్నారు.
వివరాలు
కొత్త మార్పులపై అవగాహన
ఈ సమావేశం ప్రధానంగా క్రికెట్ నిబంధనలను చర్చించేందుకు,ఫ్రాంచైజీల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు,అలాగే కొత్త మార్పులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయబడింది.
BCCI ప్రతినిధులు, IPL నిర్వాహకులు,ఇతర కీలక అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అక్షర్ పటేల్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రజత్ పటిదార్ కొత్త కెప్టెన్లుగా నియమితులయ్యారు.
మిగతా కెప్టెన్లు ప్యాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్), హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్), రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్), రిషభ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)గా కొనసాగనున్నారు.
వివరాలు
DRS నియమాలలో మార్పులు
IPL 2025 సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుందని, తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుందని BCCI ప్రకటించింది.
ఈ మ్యాచ్‌కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీ నిర్వహించేందుకు BCCI ప్రణాళికలు సిద్ధం చేస్తోంది, ఇందులో శ్రేయా ఘోషల్, శ్రద్ధా కపూర్, దిశా పటాని, కరణ్ ఔజ్లా వంటి ప్రముఖులను ఆహ్వానించనున్నారు.
ఈ సమావేశంలో DRS నియమాలలో మార్పులు,టైమ్-ఔట్ పాలసీలు,ప్రతి ఫ్రాంచైజీకి కొత్త మార్గదర్శకాలు,ప్లేయర్ల వెల్‌ఫేర్, ప్రొటోకాల్స్, షెడ్యూల్ గురించి చర్చించనున్నారు.
BCCI ప్రతినిధులు కొత్త నియమాలు,టోర్నమెంట్ ప్రొటోకాల్స్ గురించి స్పష్టతనిస్తూ, ఫ్రాంచైజీల మేనేజ్‌మెంట్, కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్లకు మరింత అవగాహన కల్పించనున్నారు.
వివరాలు
కొత్త సీజన్‌కు సంబంధించిన మార్పులను ఫ్రాంచైజీలకు తెలియజేయాలని లక్ష్యం
ఈ సమావేశం ద్వారా BCCI సమగ్ర సమన్వయాన్ని మెరుగుపర్చాలని, కొత్త సీజన్‌కు సంబంధించిన మార్పులను ఫ్రాంచైజీలకు తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కెప్టెన్లు,మేనేజర్లతో జరిగే ఈ సమావేశం IPL 2025 సీజన్ విజయవంతమైన ప్రారంభానికి దోహదం చేయనుంది.