IND vs WI : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే.. జట్టులోకి పడిక్కల్,నితీష్ కుమార్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతానికి టీమిండియా ఆసియా కప్ 2025లో బిజీగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తర్వాత,భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడబోతుంది, ఇది అక్టోబర్ 2న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఎంపికను సెలెక్టర్లు ప్రకటించారు. కెప్టెన్‌గా శుభమన్ గిల్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ పై అనుకున్నట్లుగానే వేటు పడింది దీని కారణంగా అతడి స్థానంలో స్థిరంగా ప్రదర్శన చూపిస్తున్న దేవ్దత్ పడిక్కల్‌కు అవకాశం కల్పించారు.
వివరాలు
జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ ఏమన్నాడంటే..?
ఇక ఇంగ్లండ్ నాల్గవ టెస్టులో గాయపడ్డ రిషబ్ పంత్ ఇంకా కోలుకోలేదు. అతని స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు ధ్రువ్ జురెల్‌కు అప్పగించారు. ఇక గాయం నుంచి కోలుకున్న తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వచ్చాడు. అతను శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఎంపిక అయ్యాడు. జట్టు ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడుతూ, గత సిరీస్‌లలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రదర్శన బాగా ఉన్నదని, అతనిపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని అవకాశాలు ఇస్తే నితీష్ ఇంకా మెరుగ్గా ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-ఏ జట్టుకు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే సమయంలో అతడు ఫిట్‌గా లేడన్నాడు.
వివరాలు
బుమ్రా వర్క్‌లోడ్ గురించి..
అయినప్పటికీ ప్రస్తుతానికి అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, కానీ దేశవళి స్థాయిలో మరికొన్ని మ్యాచ్‌లు ఆడితే బెటర్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. బుమ్రా వర్క్‌లోడ్ విషయంపై ఫిజియోలజిస్టులతో సంప్రదించామని, రెండు టెస్టుల పాటు అతను అందుబాటులో ఉంటాడని తెలిపారు. షమీ ఫిట్‌నెస్ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదని, అయితే టీమ్ఇండియా తరుపున ఆడే సత్తా అతడిలో ఇంకా ఉందన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ నిరాశపరిచినట్లు, అయితే ఆస్ట్రేలియాలో దేవ్దత్ పడిక్కల్ మంచి ప్రదర్శన ఇచ్చారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పడిక్కల్ వెస్టిండీస్ పై సిరీస్‌లో మంచి ప్రదర్శన ఇవ్వగలడని నమ్మకం వ్యక్తం చేశారు.
వివరాలు
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్, జగదీషన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
🚨 Presenting #TeamIndia's squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025