LOADING...
Google BCCI Deal: ఐపీఎల్ 2026కు ముందు గూగుల్‌తో భారీ డీల్..! ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు గూగుల్‌తో భారీ డీల్..! ఏడాదికి ఎంతో తెలుసా..?

Google BCCI Deal: ఐపీఎల్ 2026కు ముందు గూగుల్‌తో భారీ డీల్..! ఏడాదికి ఎంతో తెలుసా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు గా పేరుగాంచిన బీసీసీఐ ఆదాయం నిరంతరం పెరుగుతున్నది. వచ్చే మార్చి నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 19వ సీజన్ కోసం బోర్డు గూగుల్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం,గూగుల్ జెమిని రాబోయే మూడు ఐపీఎల్ సీజన్లలో లీగ్ కోసం ఏఐ స్పాన్సర్గా ఉండనుంది.

వివరాలు 

ఏడాదికి రూ.90 కోట్లు.. మొత్తం డీల్ విలువ ఎంత?

పీటీఐ నివేదిక ప్రకారం, ఈ మూడు ఏళ్ల ఒప్పందం మొత్తం విలువ రూ. 270 కోట్లు. అంటే, గూగుల్ ప్రతి ఏటా బీసీసీఐకి రూ. 90 కోట్లు చెల్లించనుంది. ఈ డీల్ ద్వారా ఐపీఎల్ గ్లోబల్ బ్రాండ్ వాల్యూ ఎంత వేగంగా పెరుగుతుందో స్పష్టమవుతోంది. క్రికెట్ విశ్లేషణలు, డేటా మేనేజ్‌మెంట్‌లో ఏఐ పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో, ఈ భాగస్వామ్యం ప్రత్యేక ప్రాధాన్యత పొందింది.

వివరాలు 

ఏఐ దిగ్గజాల మధ్య పోటీ:

ఐపీఎల్‌లో ఏఐ విప్లవం కేవలం మేన్ లీగ్‌కి మాత్రమే కాదు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో కూడా ఏఐ ఉత్సాహం కనిపిస్తోంది. గూగుల్ జెమినీకి ప్రధాన ప్రత్యర్థి అయిన 'ఓపెన్ఏఐ'కి చెందిన ChatGPT ఇప్పటికే WPL ప్రస్తుత సీజన్‌కు స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు గూగుల్ జెమిని ఐపీఎల్‌లో ప్రవేశించడంతో, క్రికెట్ వేదికలో టెక్ దిగ్గజాల మధ్య పోటీ మరింత ఉత్కంఠతో సాగనుందని కనిపిస్తోంది. క్రికెట్ అభిమానులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ఈ కంపెనీలు భారీగా వెచ్చిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

ఐపీఎల్ 2026 షెడ్యూల్:

టీ20 ప్రపంచకప్: ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు (భారత్, శ్రీలంక వేదికలు) ఐపీఎల్ 2026 ప్రారంభం: మార్చి 26, 2026 ఐపీఎల్ ఫైనల్: మే 31, 2026 ఐపీఎల్ వేలం ఇప్పటికే ముగియగా, పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో గూగుల్ జెమినీ అందించే ఏఐ విశ్లేషణలు మ్యాచ్ వీక్షణ అనుభవాన్ని ఎలా మార్చుతాయో క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement