LOADING...
BCCI: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం.. వీడియో అనలిస్ట్‌కు జీవితకాల నిషేధం
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం.. వీడియో అనలిస్ట్‌కు జీవితకాల నిషేధం

BCCI: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం.. వీడియో అనలిస్ట్‌కు జీవితకాల నిషేధం

వ్రాసిన వారు Moogati Shabari
Mar 14, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీడియో అనలిస్ట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది. రంజీ ట్రోఫీ 2024 సీజన్ సందర్భంగా రాజా రెడ్డి అనే వీడియో అనలిస్ట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. దానిని పరిశీలించిన తర్వాత అతడిపై జీవితకాల నిషేధం విధిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రెండేళ్ల క్రితం ఆంధ్ర, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో రాజా రెడ్డి అనైతిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేయడంతో యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) దర్యాప్తు ప్రారంభించింది. నేరం రుజువు కావడంతో బీసీసీఐ అతడిపై కఠిన చర్యలు తీసుకుంది.

వివరాలు

విచారణలో షాకింగ్

వీడియో అనలిస్ట్‌గా పనిచేస్తున్న రాజా రెడ్డికి థర్డ్ అంపైర్, మ్యాచ్ రిఫరీ గదులకు వెళ్లే అనుమతి కూడా ఉండేది. ఈ నేపథ్యంలో ఆంధ్ర జట్టు మేనేజర్ చేసిన ఫిర్యాదు ప్రకారం, జట్టు 'ప్లేయింగ్ ఎలెవన్'కు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని ఇవ్వాలని ఆంధ్ర ఆటగాడు గిరినాథ్ రెడ్డిని రాజా రెడ్డి సంప్రదించినట్లు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా రూ.5 లక్షలు ఇవ్వాలని అతడు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బీసీసీఐ కమిటీ వాట్సాప్ కాల్స్, చాట్ హిస్టరీలను కూడా పరిశీలించింది. ఈ విషయాన్ని గిరినాథ్ రెడ్డి ముందుగా జట్టు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫిర్యాదును ఆధారంగా చేసుకుని విచారణ జరిపినప్పుడు రాజా రెడ్డి నేరానికి పాల్పడినట్టు తేలిందని బీసీసీఐ వెల్లడించింది.

Advertisement