
తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిలా క్రికెటర్లకు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది.
మూడు గ్రేడ్ లలో కలిపి మొత్తం 17 మందితో వార్షిక కాంట్రాక్ట్ ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఇందులో ఇద్దరు తెలుగు అమ్మాయిలకి చోటు లభించింది.
లెఫ్ ఆర్మ్ మీడియం పేసర్ అంజలి, స్పెషలిస్ట్ బ్యాటర్ సబ్బినేని మేఘన ఇరువురూ గ్రేడ్ సి కాంట్రాక్టు లిస్టులో చోటు దక్కించుకొని సత్తా చాటారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి లెపార్ట్ మీడియం పేసర్ గా టీమిండియాలో చోటు దక్కించుకుంది. గతేడాది డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఆమె ఆరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ ఆరు టీ20ల్లో 3 వికెట్లను తీసింది.
Details
మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ ల జాబితా
టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్ గా టీమిండియాకు ఆడిన మేఘన ఇప్పటివరకూ మూడు వన్డేలు, 17 టీ20లు ఆడింది. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన విషయం తెలిసిందే. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు తొలిసారిగా ప్రకటించారు.
కాంట్రాక్ట్‌ల జాబితా
గ్రేడ్ 'ఎ' (రూ. 50 లక్షలు): స్మృతిమంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ
గ్రేడ్ 'బి' (రూ. 30 లక్షలు): షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్,రేణుకా ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్.
గ్రేడ్ 'సి' (రూ. 10 లక్షలు): మేఘనా సింగ్, దేవికవైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తిక భాటియా.