
బీసీసీఐని ప్రశంసలతో ముంచెత్తిన టీమిండియా మాజీ కోచ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ తర్వాత జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత టీమిండియా రెండోసారి ఫైనల్ కు వెళ్లింది. గతంలో న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా టెస్టు ఛాంపియన్ షిప్ ను దక్కించుకోవాలని టీమిండియా కసితో ఉంది. ఐపీఎల్ లో భీకర ఫామ్ లో ఉన్న అంజిక్య రహానె మళ్లీ జట్టులో సంపాదించాడు.
ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
Detais
బీసీసీఐ సెలక్షన్ సూపర్ అంటూ రవిశాస్త్రి కితాబు
బీసీసీఐ సెలెక్టర్లు అత్యుత్తమ జట్టును ప్రకటించి మంచి పనిచేశారని, వారికి అభినందనలు తెలియజేస్తున్నాయని ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో టీమిండియా రాణిస్తుందని రవిశాస్త్రి తెలియజేశారు.
గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాకు జట్టుకు దూరమయ్యారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ సెలక్షన్ సూపర్ అంటూ రవిశాస్త్రి కితాబు
Best Indian team selected. Well done selectors and team management 🇮🇳 #WTCFinal2023 #TeamIndia pic.twitter.com/olIK46GO96
— Ravi Shastri (@RaviShastriOfc) April 25, 2023