డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే
గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా అంజిక్యా రహానేకు అదృష్టం వరించింది. తాజాగా ఐపీఎల్ లో రహానే భీకర ఫామ్ లో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని షాట్స్ తో దుమ్మురేపుతున్నాడు. ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ ను ఆడేందుకు ఇష్టపడే రహానే ఐపీఎల్ లో రూట్ మార్చాడు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అంజిక్య రహానేను బీసీసీఐ ఎంపిక చేసింది. జూన్ 7వ తేదీ నుంచి లండన్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఫైనల్ ను భారత్ ఆడనుంది. అయితే టీమిండియా తరుపున అంజిక్యా రహానే బరిలోకి దిగునున్నాడు. 2022 జనవరిలో దక్షిణాఫ్రికాతో అంజిక్యా రహానే చివరి టెస్టు ఆడాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా జట్టు ఇదే
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా ఈ ఫైనల్ నుండి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ కోసం ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లను నేడు బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్ (వికెట్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ , జయదేవ్ ఉనద్కత్