Page Loader
IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై  చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం
57 బంతుల్లో 77 పరుగులు చేసిన కాన్వే

IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై  చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2023
11:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంలో శుక్రవారం చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ బ్యాట్సమెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ల ఉచ్చులో పడి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా తీక్షణ, ఆకాశ్ సింగ్, పతిరణలు తలా ఒక వికెట్ సాధించారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(34), రాహుల్ త్రిపాఠి(21), హ్యారిబ్రూక్ (18),మార్కో జాన్సన్ 17 మినహా మిగతా బ్యాట్సమెన్ నిరాశ పరిచారు.

Details

హాఫ్ సెంచరీతో రాణించిన కాన్వే

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (35),డెవాన్ కాన్వే(77) మొదటి వికెట్ కు 87(66) పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి ఓవర్‌ నుంచే వీరిద్దరూ దూకుడుగా ఆడటం ప్రారంభించారు. 11 ఓవర్ చివరి బంతికి సన్‌రైజర్స్‌కు బ్రేక్‌ దొరికింది. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన బంతిని కాన్వే స్ట్రెయిట్‌గా అడగా ఆ బంతి ఉమ్రాన్‌ చేతికి తగిలి నాన్‌ స్ట్రైకర్‌ వికెట్లకు తగిలింది. రుతురాజ్‌ క్రీజు బయటే ఉండటంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన అంబటి రాయుడు(9), అంజిక్య రహానే(9) నిరాశపరిచినా చివరి వరకూ కాన్వే క్రీజులో ఉండి చైన్నైను విజయతీరాలకు చేర్చాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కేండ్ 2 వికెట్లతో ఫర్వాలేదనించాడు.