IPL 2023: స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన సన్ రైజర్స్
చైన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన చైన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు హ్యారీబ్రూక్, అభిషేక్ శర్మ నిదానంగా ఆడారు. ఈ క్రమంలో హ్యారిబ్రూక్(28) ఆకాష్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన సన్ రైజర్స్ బ్యాట్సమెన్ వెంట వెంటనే వికెట్లను కోల్పోతూ వచ్చింది. రాహుల్ త్రిపాఠి(21) ధాటిగా అడుతుండగా రవీంద్ర జడేజా అతన్ని పెవిలియానికి పంపాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (12), హెన్రిచ్ క్లాసిక్ (17) పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు.
మూడు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా
మొదట బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ 90 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన మిగతా బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్ కే ఔట్ కావడంతో సన్ రైజర్స్ స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది. చైన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో సన్ రైజర్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. చైన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, ఆకాష్ సింగ్, పతిరణ, తీక్షణ తలా ఓ వికెట్ తీశారు. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.