Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు వరుసగా గాయపడుతుండటంతో భారత క్రికెట్ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా వంటి ప్రధాన ఆటగాళ్లు రిహాబ్ పూర్తి చేసుకుని జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ గాయాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో బీసీసీఐకి చెందిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్షల ప్రమాణాలు ఎలా ఉన్నాయి? స్పోర్ట్స్ సైన్స్ టీమ్ పనితీరు ఏంటి? జాతీయ సెలెక్టర్లకు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మధ్య సమన్వయం సరిగ్గా ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
వివరాలు
స్పందించిన క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్..
ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించారు.
అక్కడ క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కలిసి ఆటగాళ్ల రిహాబిలిటేషన్, కోలుకునే ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
మరోవైపు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ విమర్శలపై స్పందించారు.
గాయాలు అనేవి ఏ క్రీడాకారుడి కెరీర్‌లోనైనా సహజమైన భాగమేనని ఆయన అన్నారు.
గాయాలకు బాధ్యులెవరో తేల్చి, ఒకరిని 'బలిపశువు'గా చేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.
వివరాలు
నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంలోనూ కీలక పాత్ర..
ఆటగాళ్లను నిందించడం కంటే వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే సమర్థవంతమైన వ్యవస్థపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
ఆటగాళ్ల ఫిట్‌నెస్, రికవరీ విషయంలో నిరంతర పర్యవేక్షణ, సరైన ప్రణాళిక కీలకమని పేర్కొన్నారు.
అంతేకాదు.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే కేవలం గాయపడిన ఆటగాళ్లు కోలుకునే ప్రదేశం మాత్రమే కాదని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
క్రికెటర్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.