
ICC-BCCI: పాకిస్తాన్ ఆటగాళ్ల 'రెచ్చగొట్టే హావభావాలు'పై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రదర్శించిన వివాదాస్పద హావభావాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (BCCI) వారిద్దరిపై చర్యలకు ఉపక్రమించింది ఈవిషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది.ఈ-మెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. ఈ ప్రకారం, పాక్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్,ఫర్హాన్ నుండి లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు సమాధానం ఇవ్వకపోతే, ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్స్‌న్ ఎదుట వాదనలు వినిపించాల్సి ఉంటుంది.
వివరాలు
ఏమి జరిగిందంటే ..
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మన్ ఫర్హాన్ సెంచరీ సాధించిన తర్వాత,"గన్‌షాట్" చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నేపథ్యంలో ఇలాంటి ప్రవర్తనకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తన సెలబ్రేషన్స్‌ను ఫర్హాన్ సమర్థించుకుంటూ "అప్పటికప్పుడు అలా సంబరాలు చేసుకున్నా. బయట ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను"అని వ్యాఖ్యానించాడు. ఇంకా,హారిస్ రవూఫ్ మాత్రం'జెట్ ఫ్లైట్'లకు సంకేతంగా 6-0 హావభావం చూపాడు.ఇది పాకిస్తాన్-భారత మధ్య ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తుంది. ఆ సమయంలో పాక్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్ విమానాలను ధ్వంసం చేశారని ప్రకటన చేసింది. దానిని గుర్తు చేసేలా హారిస్ 'చేష్టలు' ఉన్నాయనేది ప్రధాన విమర్శ.
వివరాలు
సూర్యపై పీసీబీ కంప్లైంట్
అలాగే, భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో కూడా వాగ్వాదానికీ దిగాడు. తాజాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) భారత్‌పై మరో ఫిర్యాదును చేసి సంచలనానికి కారణమైంది. టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. గ్రూప్ స్టేజ్‌లో భారత్ పాకిస్తాన్‌పై గెలిచిన తర్వాత, సూర్య ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులు, భారత సైన్యానికి అంకితం అని ప్రకటించాడు. అయితే, పాకిస్తాన్ బోర్డు సూర్య వ్యాఖ్యలు రాజకీయపరంగా ఉన్నాయంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.