Yuzvendra Chahal: చాహల్ ఫైల్‌ను బీసీసీఐ మూసివేసింది.. మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత మహ్మద్ షమీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్‌దీప్ యాదవ్‌కు చోటు దక్కగా, యుజ్వేంద్ర చాహల్‌ను మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది.
గతంలో మంచి ప్రదర్శన చేసినా చాహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
యుజ్వేంద్ర చాహల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై చోప్రా తీవ్రంగా స్పందించాడు.
Details
రిషబ్ పంత్ కు శుభాకాంక్షలు
బీసీసీఐ చాహల్ ఫైల్‌ను మూసివేసిందని, ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. అతడు చివరిసారిగా 2023 జనవరిలో వన్డే ఆడానని, నిలకడగా వికెట్లు తీస్తున్నా అతడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని చోప్రా వ్యాఖ్యానించాడు.
ఇక లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా నియమితుడైన రిషబ్ పంత్‌కు ఆకాశ్ చోప్రా శుభాకాంక్షలు తెలిపాడు. పంత్ జట్టును సరైన దిశలో నడిపించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా, పంత్ ఆలోచనలు ఒకేలా ఉంటాయని, బౌలింగ్‌లో కూడా పెద్దగా సమస్యలు లేవన్నారు.
2023 ఐపీఎల్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.