తదుపరి వార్తా కథనం

టీమిండియాకు నయా లుక్.. జర్సీ అదుర్స్.. 3 ఫార్మాట్లకు కొత్త జర్సీలు రిలీజ్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Jun 01, 2023
09:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. మరో వారం రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ WTC 2023 ప్రారంభం నేపథ్యంలో ఆటగాళ్లకు కొత్త జెర్సీలను ప్రవేశపెట్టింది.
ఓవల్ వేదికగా జరగనున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఈ కొత్త జెర్సీతోనే ఆట ప్రారంభించనుంది.
టెస్ట్, వన్డే, టీ20 సహా అన్ని ఫార్మాట్లకూ వేర్వేరుగా కొత్త జెర్సీల కొత్త లుక్ ను సాయంత్రం విడుదల చేసింది బీసీసీఐ.
ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ లోగో ఈ కొత్త జెర్సీ మీద ఉండనుంది. దాదాపుగా 5 ఏళ్ల వరకు అంటే 2028 మర్చి వరకు టీమిండియా జెర్సీకి కిట్ స్పాన్సర్‌గా ఈ కంపెనీయే కొనసాగనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.