ఓవల్ లో కంగారులది వరస్ట్ పర్మార్మెన్స్.. ఆందోళనలో అస్ట్రేలియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో జగజ్జేత ఎవరన్నది ప్రపంచ క్రికెట్ వర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది. జూన్ 7 నుంచి 11 వరకు భారత్ - ఆసీస్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఓవల్ క్రికెట్ స్టేడియంలో కంగారులకు అంతగా కలిసిరాదనే విషయాలను గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మైదానంలో ఆసీస్ టీమ్ కు లోయెస్ట్ సక్సెస్ రేట్ ఉండటమే ఆ దేశ క్రికెట్ అభిమానుల్ని కలవరపెడుతోంది. ఫైనల్ మ్యాచ్ జరగునున్న ఓవల్ పిచ్‌పై ఆస్ట్రేలియాకు మెరుగైన రికార్డ్ లేదు. గత 50 ఏళ్ల చిరిత్రను పరిశీలిస్తే ఆసీస్ కేవలం రెండు సార్లు మాత్రమే అక్కడ గెలిచింది.
నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ క్రికెటర్లు
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఒకరిద్దరూ మినహా టీమ్ ఇండియా మెయిన్ ప్లేయర్స్ అందరూ ఇంగ్లాండ్ చేరుకున్నారు. అందరికంటే ముందుగానే ఇంగ్లాండ్ బయలుదేరిన కోహ్లి, రోహిత్‌శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్నారు. 140 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో మొత్తంగా 38 టెస్ట్‌లు ఆడిన ఆసీస్ కేవలం 7 మ్యాచుల గెలుపుతోనే సరిపెట్టుకుంది. ఫలితంగా ఓవల్ లో అతితక్కువ సక్సెస్ రేటు 18. 42 శాతంతో కొనసాగడం కొసమెరుపు. మరోవైపు భారత్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలోనే గెలిచింది.చివరగా 2021లో 157 పరుగుల భారీ ఆధిక్యంతో గెలవడం భారత క్రికెట్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే అంశం .