LOADING...
Team India: 2026-27 హోం సీజన్ షెడ్యూల్ విడుదల..రోహిత్-కోహ్లీకి 9 వన్డేల్లో అవకాశం
2026-27 హోం సీజన్ షెడ్యూల్ విడుదల..రోహిత్-కోహ్లీకి 9 వన్డేల్లో అవకాశం

Team India: 2026-27 హోం సీజన్ షెడ్యూల్ విడుదల..రోహిత్-కోహ్లీకి 9 వన్డేల్లో అవకాశం

వ్రాసిన వారు Moogati Shabari
Mar 26, 2026
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించిన 2026-27 హోం సీజన్‌ కార్యక్రమాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌ పర్యటనకు రానున్నాయి. మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లకు దేశవ్యాప్తంగా 17 నగరాలు వేదికలుగా ఎంపికయ్యాయి. ఈ హోం సీజన్‌ 2026 సెప్టెంబర్‌ 27న వెస్టిండీస్‌తో ప్రారంభమై, 2027 మార్చి 3న ముగియనుంది. ఈ సమయంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో టెస్ట్ సిరీస్ ఆడనుంది.

వివరాలు 

స్వదేశంలో 9 వన్డే మ్యాచ్‌లు..

హైదరాబాద్‌ నగరానికి ఒక వన్డే, ఒక టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం దక్కింది. మొత్తం ఈ సీజన్‌లో భారత్‌ స్వదేశంలో 9 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శనను ఈ తొమ్మిది మ్యాచ్‌లలో అభిమానులు వీక్షించే అవకాశం ఉంది. మ్యాచ్‌ల సమయాల విషయానికి వస్తే.. భారత కాలమానం ప్రకారం టీ20లు సాయంత్రం 7 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2 గంటలకు, టెస్ట్ మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.

వివరాలు 

వెస్టిండీస్‌తో సిరీస్ ఎప్పుడంటే..

తొలి వన్డే: సెప్టెంబర్‌ 27 - తిరువనంతపురం రెండో వన్డే: సెప్టెంబర్‌ 30 - గువాహటి మూడో వన్డే: అక్టోబర్‌ 3 - న్యూ చండీగఢ్‌ తొలి టీ20: అక్టోబర్‌ 6 - లక్నో రెండో టీ20: అక్టోబర్‌ 9 - రాంచీ మూడో టీ20: అక్టోబర్‌ 11 - ఇండోర్ నాలుగో టీ20: అక్టోబర్‌ 14 - హైదరాబాద్‌ ఐదో టీ20: అక్టోబర్‌ 17 - బెంగళూరు

Advertisement

వివరాలు 

శ్రీలంకతో సిరీస్ ఎప్పుడంటే..

తొలి వన్డే: డిసెంబర్‌ 13 - ఢిల్లీ రెండో వన్డే: డిసెంబర్‌ 16 - బెంగళూరు మూడో వన్డే: డిసెంబర్‌ 19 - అహ్మదాబాద్‌ తొలి టీ20: డిసెంబర్‌ 22 - రాజ్‌కోట్‌ రెండో టీ20: డిసెంబర్‌ 24 - కటక్‌ మూడో టీ20: డిసెంబర్‌ 27 - పుణె జింబాబ్వేతో సిరీస్ (2027): తొలి వన్డే: జనవరి 3 - కోల్‌కతా రెండో వన్డే: జనవరి 6 - హైదరాబాద్‌ మూడో వన్డే: జనవరి 9 - ముంబయి

Advertisement

వివరాలు 

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ (2027) ఏ రోజుల్లో అంటే..

తొలి టెస్ట్: జనవరి 21-25 - నాగ్‌పుర్‌ రెండో టెస్ట్: జనవరి 29 - ఫిబ్రవరి 2 - చెన్నై మూడో టెస్ట్: ఫిబ్రవరి 11-15 - గువాహటి నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 19-23 - రాంచీ ఐదో టెస్ట్: ఫిబ్రవరి 27 - మార్చి 3 - అహ్మదాబాద్

Advertisement