Gambhir-BCCI: టీమిండియా హెడ్ కోచ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు.. స్పందించిన బీసీసీఐ!
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ పరాజయం పొందిన విషయం తెలిసిందే. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత భూమిపై దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. దీనికి ముందు కూడా టీమిండియా వరుస పరాజయాలను ఎదుర్కొన్న నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతరం ప్రయోగాలు చేస్తున్నారన్న కారణంతో గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. గంభీర్‌పై పూర్తిస్థాయి విశ్వాసం ఉందని స్పష్టం చేస్తూ అతనికి మద్దతుగా నిలిచింది.
Details
గంభీర్ పై పూర్తి నమ్మకం ఉంది
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ... ప్లేయర్స్, సెలక్టర్లు, హెడ్ కోచ్, కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐకి సంపూర్ణ నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికీ మా మద్దతు ఉంటుంది. అందుకే వాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఒక మ్యాచ్ ఓడితేనే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వాటిని మేం పెద్దగా పట్టించుకోము. ఇదే జట్టుతో మనం ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచాం. ఇటీవల భారత్ అద్భుతంగా ఆడింది. ఇంగ్లాండ్ సిరీస్ సమంగా ముగిసింది . స్వదేశంలో ఒక్క మ్యాచ్ ఓడగానే విమర్శలు రావడం సరికాదు. గంభీర్‌పై మాకు పూర్తి నమ్మకముందని తెలిపారు.