LOADING...
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరిని తొలగించడానికి సిద్ధం!
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరిని తొలగించడానికి సిద్ధం!

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరిని తొలగించడానికి సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా, బీసీసీఐ త్వరలోనే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ రియాన్ డస్కాటేలపై వేటు వేయనుందని సమాచారం. ఆసియా కప్‌ అనంతరం వారి కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో వీరిని తిరిగి కొనసాగించాలనే ఆలోచన బీసీసీఐకు లేదని క్రీడా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌తో సంబంధం లేకుండానే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. ఇంగ్లండ్‌తో నాల్గో టెస్ట్‌ను భారత్ డ్రాగా ముగించడాన్ని విశ్లేషకులు మంచి ఫలితంగా పేర్కొంటున్నప్పటికీ,మొత్తం టెస్ట్ సిరీస్‌లో కోచింగ్ సిబ్బంది పనితీరు పట్ల బోర్డు అసంతృప్తిగా ఉందని సమాచారం.

 Details

2-1 తేడాతో ముందంజలో ఇంగ్లండ్

ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. చివరి టెస్టులో ఫలితం నిర్ణయాత్మకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, గౌతమ్ గంభీర్‌ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి సిరీస్ గెలవకపోవచ్చు. ఇదే సందర్భంలో మోర్కెల్, డస్కాటేలపై విమర్శలు అధికమవుతున్నాయి. ఇదివరకే భారత్ న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ కావడం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో ఓడిపోవడం, అలాగే స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రిటైర్మెంట్ వంటి పరిణామాలు భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆసియా కప్ తర్వాత కోచింగ్ విభాగంలో మార్పులు చేయాలని భావిస్తోంది. సెప్టెంబరులో జరిగే ఆసియా కప్ అనంతరం మోర్కెల్, డస్కాటేలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.