Page Loader
Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే? 
Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?

Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే? 

వ్రాసిన వారు Stalin
Jan 10, 2024
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు. మొహాలీ వేదికగా గురువారం ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనున్నారు. విరాట్ టీ20 పునరాగమనానికి ముందు.. అంటే గతవారం కేప్‌టౌన్‌లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కోహ్లీతో సమావేశమయ్యారు. కోహ్లీతో అగార్కర్‌తో కీలక అంశాలపై చర్చించినట్లు 'క్రిక్‌బజ్' పేర్కొంది. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై అగార్కర్‌ మాట్లాడినట్లు వెల్లడించింది. టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ పోషించాల్సిన పాత్రపై అతనికి అగార్కర్‌ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

కోహ్లీ

టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఇది చివరి సిరీస్

ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా ఆడుతున్న చివరి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరుగుతున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై బీసీసీఐ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే కోహ్లీతో సమావేశమైనట్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌తో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమవేశామయ్యారా? అనేది తెలియాల్సి ఉంది. అలాగే, ప్రపంచ కప్‌లో భారత జట్టు ఎలా ఉండాలో.. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అగార్కర్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో ఓడిన తర్వాత కోహ్లి, రోహిత్ టీ20ల్లో భారత్ తరఫున ఆడలేదు. మళ్లీ 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ఆడుతున్నారు.