Ben Stokes: స్టోక్స్‌పై ఈసీబీ వేటు?.. కెప్టెన్సీ కోల్పోయే పరిస్థితి
ఈ వార్తాకథనం ఏంటి
మద్యం కారణంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటన అతని కెప్టెన్సీ భవితవ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించిన తర్వాత, ఆ మ్యాచ్ విజయానికి కీలకంగా నిలిచిన గస్ అట్కిన్సన్‌తో కలిసి స్టోక్స్ ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం మత్తులో ఉండగా, ఓ రగ్బీ క్రీడాకారుడితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో స్టోక్స్ లేదా అట్కిన్సన్‌కు ఎలాంటి గాయాలు కాకపోయినా, అక్కడ విధుల్లో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భద్రతా సిబ్బందిలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఘటనపై ఈసీబీ సమగ్ర విచారణ చేపట్టింది.
వివరాలు
వార్నింగ్ ఇచ్చిన ఈసీబీ..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఈసీబీ ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన సిరీస్ మ్యాచ్‌లలో స్టోక్స్, అట్కిన్సన్‌లకు అవకాశం దక్కే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కే పరిమితమైన స్టోక్స్, ఈ వివాదం మరింత తీవ్రమైతే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. మద్యం కారణంగా స్టోక్స్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు.
వివరాలు
గతంలో కూడా కేసులు నమోదు..
2013లో అధికంగా మద్యం సేవించిన ఘటనతో అతడిని ఒక సిరీస్ మధ్యలోనే జట్టు నుంచి తప్పించారు. అలాగే 2017లో బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్ వద్ద జరిగిన గొడవ అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో తాను ఆత్మరక్షణ కోసమే స్పందించానని స్టోక్స్ వివరణ ఇవ్వగా, పోలీసులు అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.