Page Loader
Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో బెంగాలీ నటుడు.. కారణమిదే!
గంగూలీ బయోపిక్‌లో బెంగాలీ నటుడు.. కారణమిదే!

Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో బెంగాలీ నటుడు.. కారణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2024
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ జీవిత కథ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. హిందీలో తెరకెక్కునున్న ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త ఆప్డేట్ వచ్చింది. తొలుత ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండి ఆయుష్మాన్ తప్పుకున్నాడు. ఈ పాత్ర కోసం మరో నటుడిని వెతికి పనిలో నిర్మాణ సంస్థ ఉంది. సౌరబ్ గంగూలీకి స్నేహితుడు ప్రొసెంజిత్ ఛటర్జీ బయోపిక్‌లో నటిస్తాడని తెలుస్తోంది.

Details

 గంగూలీ జీవిత కథను తెరకెక్కిస్తున్న లువ్ రంజన్

గంగూలీ జీవిత కథను డైరక్టర్ లువ్ రంజన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రొసెంజిత్ ఎంపిక దాదాపు పూర్తియైనట్లు సమాచారం. గంగూలీ కెప్టెన్సీలో ఇండియా 146 వ‌న్డేల్లో 76 విజ‌యాలు న‌మోదు చేసింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన గంగూలీ ఐపీఎల్‌లోనూ రాణించాడు. ఆ త‌ర్వాత బీసీసీఐ 35వ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ప్ర‌స్తుతం గంగూలీ దిల్లీ క్యాపిట‌ల్స్ మెంటార్‌గా కొన‌సాగుతున్నాడు.