Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత.. ఫాస్ట్ బౌలర్‌గా అగ్రస్థానం!
ఈ వార్తాకథనం ఏంటి
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీసి, 200 వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. భువీ ఐపీఎల్‌లో 200 వికెట్లు సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా, మొత్తంలో రెండో బౌలర్‌గా రికార్డు స్థాపించాడు. భువనేశ్వర్ కుమార్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ వికెట్‌క్లబ్‌లో చేరారు. చాహల్ 224 వికెట్లు సాధించి టాప్‌లో ఉన్నారు.
వివరాలు
భువనేశ్వర్ కుమార్ సాధించిన ఘనతలు ఇవే
ఐపీఎల్‌లో 5 వికెట్ హాళ్స్ సాధించిన నాలుగు ఫాస్ట్ బౌలర్‌లో ఒకడిగా స్థానం సంపాదించారు. రెండు 4 వికెట్ హాళ్స్ కూడా కలిగిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా భువి రికార్డుకెక్కాడు. 2016, 2017 సీజన్లలో బ్యాక్-టు-బాక్ పర్పుల్ కాప్ గెలుచుకున్న ఏకైక బౌలర్ గుర్తింపు పొందారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరుపున 157 వికెట్లు సాధించిన ఘనత భువీ పేరిట ఉంది.