Page Loader
Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో సంచలన రికార్డును సృష్టించిన భువనేశ్వర్ కుమార్
ఐపీఎల్‌లో సంచలన రికార్డును సృష్టించిన భువనేశ్వర్ కుమార్

Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో సంచలన రికార్డును సృష్టించిన భువనేశ్వర్ కుమార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో తన స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తూ మరో కీలక రికార్డును నెలకొల్పాడు. ఇటీవలే చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (4-0-23-1) బౌలింగ్ చేసి, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పెవిలియన్‌కు పంపిన భువీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లలో ఒకరిగా నిలిచాడు. భువనేశ్వర్ తన కెరీర్‌లో మొత్తం 183 వికెట్లు తీసి వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు.

Details

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే 

అయితే భువీ 183 వికెట్ల మైలురాయిని 178 మ్యాచ్‌ల్లో చేరుకోగా, బ్రావో 161 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. భువీ 7.55 ఎకానమీ రేట్‌తో రెండుసార్లు ఐదు వికెట్ల హౌల్స్ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌ ఆల్ టైమ్ వికెట్ టేకర్స్ జాబితాలో భువీ మూడో స్థానంలో నిలిచాడు. అతని ముందు యుజ్వేంద్ర చాహల్ (206 వికెట్లు), పీయూష్ చావ్లా (192 వికెట్లు) ఉన్నారు. 1. చాహల్- 206 వికెట్లు(161 ఇన్నింగ్స్‌లు) 2. చావ్లా- 192 వికెట్లు(191 ఇన్నింగ్స్‌లు) 3. బ్రావో - 183 వికెట్లు(158 ఇన్నింగ్స్‌లు) 4. భువనేశ్వర్ కుమార్ 183 వికెట్లు(178 ఇన్నింగ్స్‌లు) 5. అశ్విన్ - 183 వికెట్లు(211 ఇన్నింగ్స్‌లు) 6. నరైన్ - 181 వికెట్లు(177 ఇన్నింగ్స్‌లు)