Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భారీ మార్పులు.. ఐదుగురు స్టార్ ప్లేయర్స్‌కు గుడ్‌బై!
ఈ వార్తాకథనం ఏంటి
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టులో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త యాజమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది, కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ నియామకం — ఇలా అన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. లీగ్ తొలి అర్ధభాగంలో డీసీ బలంగా ఆడింది. వరుసగా నాలుగు విజయాలు సాధించి, ఐదవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో తృటిలో ఓటమి చవిచూసింది. ఆరవ మ్యాచ్‌లో మళ్లీ విజయం సాధించిన ఢిల్లీ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. అనంతర ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు గెలుపులు మాత్రమే సాధించింది. అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. చివరికి ఒక పాయింట్, నెట్‌రన్‌రేట్ తేడాతో టాప్-4లో స్థానం కోల్పోయింది.
Details
నిలకడ లేకపోవడం ఆ జట్టు బలహీనత
ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఏళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్య — నిలకడ లేకపోవడం. అదే జట్టుకు బలహీనతగా మారింది. రికీ పాంటింగ్ శిక్షణలో ఒక దశలో టైటిల్ పోటీదారులా కనిపించినా.. తర్వాత ఫామ్ కోల్పోయింది. ఈ ఏడాదైనా సెమీఫైనల్ చేరాలంటే జట్టులో కొంత మార్పు అవసరమని ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా స్పష్టమైంది. పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను విడుదల చేసి, ఆ ఖాళీ పర్సును ప్రభావవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 మినీ వేలానికి టీమ్స్ సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రిలీజ్ చేయబోయే ఐదుగురు స్టార్ ప్లేయర్ల జాబితా బయటకు వచ్చింది. ఈ లిస్ట్‌లో టాప్ బ్యాటర్లు, పేసర్లు ఉన్నారు.
Details
మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2024 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ స్టార్క్ నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోవడంతో కోల్‌కతా అతడిని రిలీజ్ చేసింది. అనంతరం 2025లో ఢిల్లీ రూ.11.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో స్టార్క్ సగటు ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినందున, స్టార్క్ ఐపీఎల్ నుంచి కూడా వైదొలగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టి నటరాజన్ తమిళనాడు పేసర్ టి నటరాజన్‌పై ఢిల్లీ రూ.10.75 కోట్లు వెచ్చించింది. అయితే అతడు కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. పేలవ బౌలింగ్, తరచు గాయాల కారణంగా నటరాజన్ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు.
Details
జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్
ఆస్ట్రేలియా యువ బ్యాటర్ మెక్‌గుర్క్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడగలడు. కానీ గత సీజన్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఫామ్ కోల్పోవడంతో అతడిని జట్టులో కొనసాగించకూడదని ఢిల్లీ భావిస్తోంది. రూ.9 కోట్ల విలువైన ఈ ప్లేయర్‌ను రిలీజ్ చేసి, ఆ మొత్తంతో మరింత ప్రభావవంతమైన బ్యాటర్‌ను తీసుకునే ఆలోచనలో ఉంది. ముఖేష్ కుమార్ భారత పేసర్ ముఖేష్ కుమార్‌ను రూ.8 కోట్లకు డీసీ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 12మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసినా, 10.32 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బలహీనత కనబరిచాడు. 2026 వేలానికి ముందు అతడిని రిలీజ్ చేసి, కొత్త స్టార్ బౌలర్‌ను తీసుకోవాలని జట్టు ప్లాన్ చేస్తోంది.
Details
ఫాఫ్ డుప్లెసిస్
ఐపీఎల్ 2025లో ఢిల్లీ రూ.2 కోట్లకు ఫాఫ్ డుప్లెసిస్‌ను సొంతం చేసుకుంది. చెన్నైలో అద్భుత ప్రదర్శన చేసిన ఈ సీనియర్ బ్యాటర్‌పై డీసీ పెద్ద అంచనాలు పెట్టుకుంది. కానీ 9 మ్యాచ్‌ల్లో కేవలం 202 పరుగులు (సగటు 22.44, స్ట్రైక్‌రేట్ 123.92) మాత్రమే సాధించాడు. ప్రస్తుత ఫామ్ కూడా బలహీనంగా ఉండడంతో, డుప్లెసిస్‌ను మినీ వేలానికి ముందు రిలీజ్ చేయాలనే నిర్ణయానికి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చింది.