IPL 2026: ఐపీఎల్ వేలంలోకి బిగ్ హిట్టర్.. కోట్టు కుమ్మరించేందుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 (IPL 2026) కొత్త సీజన్ కోసం సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 15న 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి మినీ వేలంపై నిలిచింది. ఏ ఆటగాళ్లు వేలంలో హాట్‌కేక్‌లుగా నిలుస్తారు? ఎవరి మీద కోట్ల వర్షం కురుస్తుందన్న ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో IPL 2026లో అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న ఆరు బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.
Details
1. డేవిడ్ మిల్లర్
అత్యంత విస్ఫోటక ఆల్‌రౌండర్లలో ఒకరిగా పేరుగాంచిన మిల్లర్, మిడిల్ ఆర్డర్‌లో మ్యాచ్‌ను ఏ దిశలోనైనా మలుపు తిప్పగలడు. లక్నో సూపర్ జెయింట్స్ IPL 2026కు ముందు అతన్ని విడుదల చేయడంతో, మినీ వేలంలో అతనికి గట్టి డిమాండ్ ఉండటం ఖాయం. 2. డెవాన్ కాన్వే ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అనేక విజయాలు అందించిన కాన్వే, గత సీజన్‌లో మాత్రం నిరాశపరిచాడు. దీంతో సీఎస్‌కే అతన్ని రిలీజ్ చేసింది. తనను నిరూపించుకున్న ఈ డేంజరస్ బ్యాటర్‌ను ఏ జట్టు దక్కించుకుంటుందన్న ప్రశ్న అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Details
3. ఫాఫ్ డుప్లెసిస్
41 ఏళ్ల వయసులోనూ బౌలర్లకు భయం పుట్టించే ఫాఫ్, ఐపీఎల్‌లో ఎన్నో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్ నిరాశపరిచినప్పటికీ, మ్యాచ్‌ను ఒంటరిగా మార్చేస్తానన్న నైపుణ్యం అతనిలో ఇప్పటికీ ఉంది. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన ఫాఫ్‌ను ఈసారి విడుదల చేయడంతో, IPL 2026 వేలంలో అతను కీలకంగా నిలుస్తాడు. 4. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ యువ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ప్రపంచవ్యాప్తంగా తన తుఫాను శైలితో వార్తల్లో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో RTM కార్డు ఉపయోగించి రూ. 9 కోట్లకు అతన్ని దక్కించుకున్నప్పటికీ, ఈసారి అతన్ని విడుదల చేసింది. దీంతో IPL 2026లో కూడా అతను పెద్ద బేరం కావడం ఖాయం.
Details
5. క్వింటన్ డి కాక్
కేకేఆర్ కోసం విధ్వంసక ఓపెనర్‌గా మెరిసిన డి కాక్, గత సీజన్‌లో మాత్రం రాణించలేకపోయాడు. అయినా కూడా బౌలర్లకు అతని పేరు ఇప్పటికీ పెద్ద బెడదగా ఉంటుంది. IPLలో ఎన్నో సంవత్సరాలుగా తన ముద్ర వేశాడు.IPL 2026కు ముందు కేకేఆర్ అతన్ని విడుదల చేయడంతో, మినీ వేలంలో డి కాక్ కూడా ప్రధాన ఆకర్షణ కానున్నాడు. 6. ఆండ్రీరస్సెల్ వేలంలోకి వచ్చే అతిపెద్ద పేరు రస్సెల్‌దే. కేకేఆర్ నుంచి విడుదలైనప్పటికీ, మినీ వేలంలో మళ్లీ అతన్ని పరిగణించే అవకాశం ఉంది. తన విధ్వంసక బ్యాటింగ్‌తో ఏ మ్యాచ్‌కైనా గమనాన్ని మార్చగలడు. 223 సిక్సర్లతో విదేశీ ఆటగాళ్లలో ఐపీఎల్ చరిత్రలో మూడవ స్థానంలో ఉన్న రస్సెల్, 2026 వేలంలో అత్యంత చర్చనీయాంశం కానడం ఖాయం.