Loading...
IPL-2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే షాక్‌.. స్టార్ ప్లేయర్లు అవుట్!
ఐపీఎల్ ప్రారంభానికి ముందే షాక్‌.. స్టార్ ప్లేయర్లు అవుట్!

IPL-2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే షాక్‌.. స్టార్ ప్లేయర్లు అవుట్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 20, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్‌ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పది జట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొన్ని టీమ్‌లకు ప్రారంభంలోనే దెబ్బ తగిలింది. ముఖ్యమైన ఆటగాళ్లలో కొందరు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోగా, మరికొందరు పూర్తిగా టోర్నీకి దూరమయ్యారు. ఐపీఎల్‌కు దూరమవుతున్న ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. పాట్ కమిన్స్‌: సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్‌ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రధాన బౌలర్‌గా ఉన్న అతను జట్టుకు దూరమవ్వడం పెద్ద నష్టమే అని చెప్పాలి. వెన్ను సమస్య వల్ల గత టీ20 ప్రపంచ కప్‌లో కూడా అతడు పాల్గొనలేదు. కమిన్స్ స్థానంలో ఇషాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

వివరాలు

గాయాల కారణంగా దూరం..

జోష్ హేజిల్‌వుడ్‌:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ముఖ్య బౌలర్‌గా ఉన్న జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

కుడి కాలి మడమ గాయం కారణంగా గత టీ20 ప్రపంచ కప్‌లో కూడా ఆడలేకపోయాడు.

పవర్‌ప్లే, చివరి ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న అతడు ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడో ఇంకా స్పష్టత లేదు.

హర్షిత్ రాణా:

హర్షిత్ రాణా దూరమవ్వడం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది పెద్ద దెబ్బగా మారింది.

పేస్ ఆల్‌రౌండర్‌గా హర్షిత్ రాణా కీలక పాత్ర పోషిస్తాడు.

అయితే మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్‌కు ముందే అతడు దూరమయ్యాడు.

వివరాలు

కోల్ కతా జట్టుకు వరుస దెబ్బలు

మతీశా పతిరణ: ఇప్పటికే హర్షిత్ రాణా లేక ఇబ్బందులు పడుతున్న కోల్‌కతా జట్టుకు మరో సమస్యగా మతీశా పతిరణ గాయం మారింది.

వేలంలో తీసుకున్న ఈ పేసర్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు.

గాయం తగ్గిన తర్వాత కూడా పూర్తి ఫిట్‌నెస్‌కు రావడానికి సమయం పట్టే అవకాశముంది.

జట్టు మేనేజ్‌మెంట్ అతడు సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నప్పటికీ, ప్రారంభ మ్యాచ్‌ల్లో అతడు ఆడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

వనిందు హసరంగ: ఈ స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాలని భావించినప్పటికీ, కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి ఉంది.

భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచ కప్‌లో కూడా అతడు పాల్గొనలేదు.

ADVERTISEMENT

వివరాలు

నాథన్ ఎలిస్‌ దూరం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన పేసర్ నాథన్ ఎలిస్ ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

తొడ కండర గాయం కారణంగా అతడు లీగ్ నుంచి తప్పుకున్నట్లు జట్టు ప్రకటించింది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.

ఎలిస్‌ను 2025 వేలంలో సీఎస్‌కే రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

స్లో బంతులతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం అతడి ప్రధాన బలం.

ADVERTISEMENT