LOADING...
IND vs AUS : భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం! 
భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!

IND vs AUS : భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు, ఆస్ట్రేలియాకు పర్యటనకు బయలుదేరనుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌ల జట్లు భారత్, ఆస్ట్రేలియా ప్రకటించారు. అయితే తొలి వన్డేకు ముందు ఆసీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్స్ జోష్ ఇంగ్లిస్, ఆడమ్ జంపా తొలి వన్డేకు దూరమైనట్లు తెలిసింది. జంపా తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండగా, న్యూ సౌత్ వేల్స్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు.

Details

గాయం కారణంగా ఇంగ్లిస్ దూరం

అయితే రెండో, మూడో వన్డేల్లో తిరిగి జట్టులో చేరనున్నాడు. ఇంగ్లిస్ కాలి కండరాల గాయం కారణంగా తొలి వన్డేకు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా ఫస్ట్-చాయిస్ కీపర్ అలెక్స్ కారీ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది, ఎందుకంటే యాషెస్ సిరీస్ సన్నద్ధం కోసం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడతాడు. కారీ సీరీస్‌లో పాల్గొనలేకపోతే జోష్ ఫిలిప్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు సంపాదించనున్నాడు.

Details

ఆసీస్ తొలి వన్డే జట్టు (పెర్త్)

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్ వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే: అక్టోబర్ 19 - పెర్త్ రెండో వన్డే: అక్టోబర్ 23 - అడిలైడ్ మూడో వన్డే:** అక్టోబర్ 25 - సిడ్నీ