Pratika Rawal: భారత్‌కు బిగ్ షాక్.. గాయంతో ప్రపంచకప్‌కి దూరమైన ప్రతీకా రావల్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు తీవ్ర షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీఫైనల్‌కు ముందే స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ టోర్నమెంట్‌నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆమె చీలమండ గాయపడ్డ సంగతి తెలిసిందే. నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో ప్రతీకా రావల్ కుడికాలు మడతపడి తీవ్రంగా గాయపడ్డారు. మైదానం చిత్తడిగా ఉండడంతో స్లిప్ అయ్యి పడిపోయిన ఆమెను వెంటనే సహచరులు బయటకు తరలించారు.
Details
తక్కువ సమయంలోనే అద్భుత రికార్డులు
గాయ తీవ్రత కారణంగా బ్యాటింగ్‌కూ రాలేకపోయింది. ఆమె స్థానంలో అమన్ జ్యోత్ కౌర్ ఇన్నింగ్స్ ఆరంభించింది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. డిసెంబర్ 2024లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్, తక్కువ సమయంలోనే అద్భుత రికార్డులు సొంతం చేసుకున్నారు. మహిళల వన్డేల్లో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించారు. మరో ఓపెనర్ స్మృతి మంధానాతో కలిసి భారత జట్టుకు దృఢమైన ఆరంభాలు అందిస్తున్నారు.
Details
రిచా హోష్ కు కూడా గాయం
ఇదిలా ఉండగా వికెట్‌కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ కూడా సెమీఫైనల్‌లో పాల్గొనగలదా లేదా అనే అనుమానం నెలకొంది. కివీస్‌తో మ్యాచ్‌లో ఆమె వేలికి గాయమైంది. దాంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమెకు విశ్రాంతి ఇచ్చారు. రిచా కూడా ఆడకపోతే, వచ్చే గురువారం (అక్టోబర్ 30) జరగనున్న ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. మొత్తానికి, రెండు కీలక ఆటగాళ్ల గాయాలతో టీమ్ ఇండియా సెమీఫైనల్ ముందు తీవ్రమైన ఆందోళనలో పడింది.