KL Rahul: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి ముప్పు.. లక్నో కీలక నిర్ణయం!
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్‌ను ఈ సీజన్‌లో వదిలించుకోవాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మూడు సంవత్సరాలుగా రాహుల్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, ఆయన ప్రతిష్టాత్మక స్థాయిలో రాణించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా అతడిని రిటైన్ చేయాలా వద్దా అనే దానిపై సందేహం మొదలైంది. ఇందుకు సంబంధించి, ఐపీఎల్ పాలకమండలి ఇప్పటికే కొన్ని నిబంధనలు ఖరారు చేసింది. వాటిలో రైట్ టు మ్యాచ్ కార్డ్‌తో పాటు మొత్తం ఆరు రిటెన్షన్‌లకు అనుమతించారు. దాదాపు ఒక వారంలో ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌కు సంబంధించి నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్‌లను టాప్-3 రిటెన్షన్‌ల్లో ఉంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్ ని విడిచిపెట్టే యోచనలో ఫ్రాంచైజీ
కేఎల్ రాహుల్ రాణించకపోవడంతో, ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టే ఆలోచనలో ఉంది. లక్నో యాజమాన్యం, కోచ్ జస్టిన్ లాంగర్, మెంటర్ జహీర్ ఖాన్ వంటి సభ్యులు కేఎల్ రాహుల్ గణాంకాలను పరిశీలించిన తర్వాత, అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. 2023లో 113 స్ట్రైక్ రేటుతో 274 పరుగులు మాత్రమే సాధించారు, 2024 సీజన్‌లో 136 స్ట్రైక్ రేటుతో 520 పరుగులు చేశారు. రాహుల్‌ను రిటైన్ చేయకపోయినా, లక్నో ఫ్రాంఛైజీ అతడిని వేలంలో కొనుగోలు చేయాలని భావిస్తోంది. తక్కువ ధరలో రాహుల్‌ని సొంతం చేసుకోవాలనుకుంటే, ఆర్టీఎం కార్డును ఉపయోగించే అవకాశం ఉంది. లేకపోతే కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన సంబంధం ముగిసే అవకాసం ఉంది.