Page Loader
Prithvi Shaw: ముంబైకి భారీ షాక్.. ఆ రెండు టోర్నీలకు పృథ్వీషా దూరం..!
ముంబైకి భారీ షాక్.. ఆ రెండు టోర్నీలకు పృథ్వీషా దూరం..!

Prithvi Shaw: ముంబైకి భారీ షాక్.. ఆ రెండు టోర్నీలకు పృథ్వీషా దూరం..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2023
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవాళీ ట్రోఫీలకు ముందు ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. వన్డే కప్‌లో ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల నుంచి వైదొలినట్లు తెలుస్తోంది. షా గాయం గురించి ముంబై క్రికెట్ ఆసోసియేషన్ అతడిని సంప్రదించింది. సర్జరీ తర్వాత కోలుకోవడానికి సమయం పడుతుందని, దీంతో ఆ రెండు టోర్నీలకు దూరంగా ఉండనున్నట్లు షా వెల్లడించినట్లు సమాచారం. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు, విజయ్ హజరే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనుంది.

Details

వన్డే కప్ లో అదరగొట్టిన పృథ్వీ షా

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న వన్డే కప్ లో నార్తంప్టన్ షైర్ జట్టు తరుఫున పృథ్వీ షా సంచనల ఫామ్ తో అదరగొట్టాడు. సోమర్‌సెట్‌పై డబుల్ సెంచరీ, డుర్హం జట్టుపై సెంచరీతో సత్తా చాటాడు. అయితే డుర్హం జట్టుతో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తుండగా షా మోకాలికి గాయమైంది. మొదట గాయం చిన్నదే అనుకున్నా కానీ, స్కానింగ్ లు తీశాక గాయం తీవ్రత ఎక్కవ ఉందని తేలింది. దీంతో నార్తంప్టన్ షైర్ జట్టు తరుఫున జరిగే మిగతా మ్యాచులకు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున రాణించకపోవడంతో భారత జట్టులో పృథ్వీ షా చోటు సంపాదించలేకపోయాడు.