Page Loader
శ్రీలంకకు బిగ్ షాక్.. వన్డే ప్రపంచ కప్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం
శ్రీలంకకు బిగ్ షాక్.. వన్డే ప్రపంచ కప్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం

శ్రీలంకకు బిగ్ షాక్.. వన్డే ప్రపంచ కప్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2023
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వేదికగా మరో రెండు వారాల్లో వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు వన్డే ప్రపంచ కప్ కోసం జట్లలను ప్రకటించాయి. ఈ తరుణంలో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వానిందు హసరంగా ఈ టోర్నీ మొత్తానికి దూరం కానున్నారు. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ లో హసరంగ తొడ కండరాల గాయం భారీన పడటంతో ఆసియా కప్ లో ఆడలేదు. అయితే హసరంగ కోలుకొని వన్డే ప్రపంచ కప్ ఆడతాడా? లేదా అనేదిపై సందిగ్ధత నెలకొంది. హసరంగ ఫిట్ నెస్ గురించి ఆ జట్టు మెడికల్ ప్యాన్ హెడ్ అర్జున కీలక వ్యాఖ్యలు చేశాడు.

Details

హసరంగ వన్డే ప్రపంచ కప్ లో ఆడే అవకాశాలు తక్కువ

హసరంగ వన్డే ప్రపంచ కప్ లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు హసరంగకు శస్త్ర చికిత్స కోసం తాము విదేశీ వైద్యులను సంప్రదించామని, కనీసం అతను మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి అంత గొప్పగా లేదని అర్జున పేర్కొన్నారు. వన్డే ప్రపంచ కప్‌లో 10 జట్లు పోటీ పడుతుండగా, శ్రీలంక, బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇక అక్టోబర్ 7న సౌతాఫ్రికాతో శ్రీలంక తొలి మ్యాచులో పోటీ పడనుంది.