LOADING...
IND vs AUS: సిడ్నీ వన్డేలో టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! 
సిడ్నీ వన్డేలో టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

IND vs AUS: సిడ్నీ వన్డేలో టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడి, మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. క్రికెట్‌లో హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన ఓ బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కెరీ గాల్లోకి ఎగరించే ప్రయత్నం చేసింది. ఆ సిక్స్ అయ్యే బంతిని వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

Details

బ్యాటింగ్ చేయడంపై అనుమానం

కానీ, ఈ క్యాచ్ తీసుకునే సమయంలో అయ్యర్ కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయంతో అతను నొప్పితో విలవిలలాడాడు. టీమిండియా ఆటగాళ్లు వెంటనే వెళ్లి అయ్యర్‌ని లేపి ఫిజీషియన్ల సహాయం అందించారు. గాయంతో స్టేడియాన్ని వీడిన అయ్యర్‌ బ్యాటింగ్ చేయడం కష్టతరం అవుతుందని తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దూరమైతే, భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో పెద్ద సవాలు ఎదురుకావాల్సి ఉంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాయపడ్డ అయ్యర్