
Rishabh Pant : టీమిండియాకు బిగ్ షాక్.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పంత్ దూరం..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం భారత జట్టును ఎంపిక చేయనుందనే వార్తలు వెలువడ్డాయి. అయితే రిషబ్ పంత్ ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారనే సమాచారం కూడా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో నాల్గో టెస్టు ఆడిన సమయంలో పంత్ కాలికి గాయమైంది. దీనివల్ల ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుతో పాటు ఆసియాకప్ 2025కి కూడా పంత్ దూరం అయ్యారు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న పంత్ బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాస శిబిరంలో ఉన్నారు.
Details
పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్
కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వార్తలు ఉన్నాయి. అందువల్ల అక్టోబర్ 2 నుంచి జరగనున్న వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కి పాటు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌కు కూడా పంత్ దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం అతడు మైదానానికి తిరిగి ఎప్పుడు అడుగుపెడతారనే విషయంపై సమాచారం లేదు. పంత్ దూరం కావడం వల్ల ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా వెస్టిండీస్ సిరీస్‌లో ఎంపిక కానున్నారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా పంత్ గైర్హాజరీ సమయంలో జురెల్ ఈ బాధ్యత నిర్వర్తించారు.
Details
పడిక్కల్ ఎంపికయ్యే అవకాశాలు
ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో 140 పరుగులు చేసిన జురెల్, అలాగే 150 పరుగులు చేసిన దేవ్దత్ పడిక్కల్ కూడా వెస్టిండీస్ సిరీస్‌లో ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంగ్లాండ్ పర్యటనతో 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో ప్రదర్శించలేకపోయారు. దీని కారణంగా అతనికి వెస్టిండీస్ సిరీస్‌లో చోటు దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది. అలాగే మిడిల్ ఆర్డర్‌లోని శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తారో లేదో కూడా చూడాలి.