Page Loader
SA vs BAN : బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం
174 పరుగులతో చెలరేగిన క్వింటన్ డికాక్

SA vs BAN : బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 24, 2023
10:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో బంగ్లాపై సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో బంగ్లా 46.4 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆలౌటైంది. క్వింటన్ డికాక్ (174), హెన్రిచ్ క్లాసెన్ (90), మార్ర్కమ్ 60 పరుగులతో చెలరేగడంతో సౌతాఫ్రికా, బంగ్లా ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు.

Details

మహ్మదుల్లా పోరాటం వృథా

18 ఓవర్లకు సగం వికెట్లను కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. ఏడో ఓవర్ వేసిన మార్కో జన్సన్ వరుస బంతుల్లో తాంజిద్ హసన్(12), శాంటో(0)లను పెవిలియానికి పంపి బంగ్లాను దెబ్బ కొట్టాడు. తర్వాత వచ్చిన షకీబ్(1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇక బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(111) సెంచరీతో చెలరేగాడు. ఒక్కడే క్రీజులో నిల్చుకొని పోరాడిన ఫలితం లేకుండా పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు పడగొట్టగా, మార్కో జాన్సన్ , రబడ తలా రెండు వికెట్లు తీశారు.