Loading...
ESPN: 24 గంటల క్రీడా ప్రసారాలకు నాంది పలికిన బిల్ రాస్ముసెన్ కన్నుమూత
24 గంటల క్రీడా ప్రసారాలకు నాంది పలికిన బిల్ రాస్ముసెన్ కన్నుమూత

ESPN: 24 గంటల క్రీడా ప్రసారాలకు నాంది పలికిన బిల్ రాస్ముసెన్ కన్నుమూత

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రీడా ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఈఎస్‌పీఎన్ (ESPN) సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ (93) కన్నుమూశారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతిపై ఈఎస్‌పీఎన్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ప్రతినిధులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్రీడా ప్రసార రంగానికి ఆయన అందించిన సేవలను, ఆయన దూరదృష్టిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

వివరాలు

ఆ ఆలోచనతోనే ఈఎస్‌పీఎన్‌కు పునాది..

1970వ దశకం చివర్లో బిల్ రాస్ముసెన్ తన కుమారుడు స్కాట్‌తో కలిసి క్రీడలకు మాత్రమే అంకితమైన ప్రత్యేక కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు.

రోజులో 24 గంటలూ కేవలం క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రసారాలు అందించే ఛానల్ ఉండాలన్నది వారి ఆలోచన.

అప్పట్లో ఈ కాన్సెప్ట్‌పై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. అదే ఆలోచన తర్వాత ప్రపంచ క్రీడా ప్రసార రంగాన్ని మార్చేసింది.

రాస్ముసెన్ ఆలోచనలకు కార్యరూపం దక్కడంతో 1979 సెప్టెంబర్ 7న ఈఎస్‌పీఎన్ ప్రసారాలను ప్రారంభించింది.

తొలినాళ్లలో ఈ కొత్త తరహా స్పోర్ట్స్ నెట్‌వర్క్‌పై సందేహాలు ఉన్నప్పటికీ.. కొద్దికాలంలోనే ఈఎస్‌పీఎన్ మీడియా రంగంలో సంచలనంగా మారింది.

ఈ సంస్థకు రాస్ముసెన్ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వివరాలు

'గొప్ప దార్శనికుడు, ఆవిష్కర్త'

బిల్ రాస్ముసెన్ మృతిపై ఈఎస్‌పీఎన్ ఛైర్మన్ జిమ్మీ పిటారో సంతాపం వ్యక్తం చేశారు.

రాస్ముసెన్‌ను అసాధారణ వ్యక్తిగా, గొప్ప దార్శనికుడిగా, ఆవిష్కర్తగా ఆయన అభివర్ణించారు.

క్రీడలకు ప్రత్యేకంగా అంకితమైన టెలివిజన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రాస్ముసెనే రూపకల్పన చేశారని పేర్కొన్నారు.

1970వ దశకంలో రాస్ముసెన్ ప్రదర్శించిన స్ఫూర్తి, క్రీడలపై ఆయనకున్న ఆసక్తి, అభిరుచి ఇప్పటికీ ఈఎస్‌పీఎన్ సంస్థ సంస్కృతిలో కనిపిస్తూనే ఉన్నాయని జిమ్మీ పిటారో తెలిపారు.

ఈఎస్‌పీఎన్ ప్రముఖ యాంకర్ క్రిస్ బెర్మన్ కూడా రాస్ముసెన్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయనను తమకు 'జార్జ్ వాషింగ్టన్'తో సమానమైన వ్యక్తిగా, అదే సమయంలో ఎంతో సన్నిహితమైన మంచి స్నేహితుడిగా అభివర్ణించారు.

ADVERTISEMENT

వివరాలు

2025లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు..

క్రీడా ప్రసార రంగానికి బిల్ రాస్ముసెన్ చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2025లో ఆయనకు స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది.

క్రీడలను 24 గంటలూ ప్రసారం చేసే ప్రత్యేక నెట్‌వర్క్‌ ఆలోచనకు రూపకల్పన చేసి, దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాస్ముసెన్.. ప్రపంచ క్రీడా ప్రసార రంగంపై చెరగని ముద్ర వేశారు.

బిల్ రాస్ముసెన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఆయనకు ఏడుగురు మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

ADVERTISEMENT