LOADING...
Arun Jaitley Stadium: దిల్లీలో పేలుడు.. అరుణ్ జైట్లీ స్టేడియంలో భద్రత కట్టుదిట్టం
దిల్లీలో పేలుడు.. అరుణ్ జైట్లీ స్టేడియంలో భద్రత కట్టుదిట్టం

Arun Jaitley Stadium: దిల్లీలో పేలుడు.. అరుణ్ జైట్లీ స్టేడియంలో భద్రత కట్టుదిట్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. పేలుడు ప్రాంతం అరుణ్ జైట్లీ మైదానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటన నేపథ్యంలో మైదానం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం, ఈ గ్రౌండ్‌లో రంజీ ట్రోఫీలో భాగంగా దిల్లీ, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రంజీ ట్రోఫీ నాలుగో రోజు మ్యాచ్ సందర్భంగా అరుణ్ జైట్లీ స్టేడియం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశామని డీడీసీఏ కార్యదర్శి ఆశోక్ వర్మ తెలిపారు. ఎప్పటికప్పడు పోలీసు అధికారులతో టచ్‌లో ఉన్నామని, స్టేడియం పరిసర ప్రాంతాల్లో అదనపు భద్రత కల్పించమని కోరామన్నారు.

Details

 దిల్లీ, జమ్మూకశ్మీర్ జట్ల రంజీ మ్యాచ్

మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఫోర్త్ ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్ జట్టు 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆ జట్టు విజయాన్ని సాధించాలంటే జట్టు ఇంకా 124 పరుగులు చేయాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ జట్టు 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో కమ్రాన్ ఇక్బాల్ (32*), వన్షాజ్ శర్మ (0*) ఉన్నారు.