Page Loader
IPL 2023: చెలరేగిన ముంబై బ్యాటర్లు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే? 
హాఫ్ సెంచరీతో రాణించిన గ్రీన్

IPL 2023: చెలరేగిన ముంబై బ్యాటర్లు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2023
09:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ 25వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇసాన్ కిసాన్ ఫర్వాలేదనిపించారు. 28 పరుగులు చేసిన రోహిత్ నట్ రాజన్ బౌలింగ్ లో మార్ర్కమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇషాన్ కిషాన్ 31 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఇషాన్ కిషాన్(7) నిరాశపరిచాడు. అయితే తిలక్ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో విజృంభించాడు.

Details

హాఫ్ సెంచరీతో రాణించిన గ్రీన్

ఒక పక్క వికెట్లు పడుతున్న కామరూన్ గ్రీన్ క్రీజులో చివరి వరకూ నిలబడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేవలం 40 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు) 64 పరుగులు చేశాడు. చివరి గ్రీన్ నిలబడి ఆడటంతో ముంబై భారీ స్కోరును చేయగలిగింది. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్ 2, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలా ఓ వికెట్ తీశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 192 పరుగులను చేసింది