Page Loader
IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా
హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ముంబై, సన్ రైజర్స్

IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2023
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. మంగళవారం హైదారాబాద్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. తర్వాతి జరిగిన రెండు మ్యాచ్‌లోనూ ఇరు జట్లు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ విజయం సాధించాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై ఎనిమిదో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ మైదానం విషయానికొస్తే.. ఇక్కడ ఇప్పటివరకూ 66 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో చేజింగ్ జట్లు 37 సార్లు విజయాలు సాధించాయి. ఈ వేదికపై సన్ రైజర్స్ 46 మ్యాచ్‌ల్లో 31 విజయాలను సాధించింది

ఎస్ఆర్‌హెచ్

ఇరు జట్లులోని సభ్యులు

ముంబై ఇండియన్స్ తరుపున ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రాణిస్తుండడం ఆ జట్టుకు అదనపు బలం. రోహిత్ శర్మ సైతం స్కోరు బోర్డును పరిగెత్తించడంలో సిద్ధహస్తుడు. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ మార్ర్కమ్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. (SRH): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (c), అభిషేక్‌శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (WK), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, T నటరాజన్ (MI): ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్