IPL 2023: ఉత్కంఠ పోరులో చైన్నై విక్టరీ
చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ముందు చైన్నై 227 పరుగుల భారీ స్కోరును ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చైన్నై అది నుండి దూకుడుగా ఆడింది. చైన్నై బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని మోత మోగించారు. అనంతరం భారీ స్కోర్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూర్ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెవెన్ కాన్వే 45 బంతుల్లో (6ఫోర్లు, 6సిక్సర్లు) 83 పరుగులు, అంజిక్య రహానే 20 బంతుల్లో 37 పరుగులు, శివందూబే 27 బంతుల్లో 52 పరుగులతో చెలరేగారు. బౌలర్లలో మహ్మద్ సిరాజ్, మాక్స్ వెల్, వేన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాఖ్, వానిందు హసరంగా, హర్షద్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు.
అర్ధ సెంచరీతో రాణించిన డుప్లెసిస్, మాక్స్ వెల్
లక్ష్య చేధనకు బరిలోకి దిగిన బెంగళూర్, చైన్నైకి ధీటుగానే బదులిచ్చింది. కోహ్లీ, లామ్‌రోర్ త్వరగా ఔట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మాక్స్ వెల్ 36 బంతుల్లో (8 సిక్సర్లు, 3 ఫోర్లు) 76 పరుగులు, డుప్లెసిస్ 33 బంతుల్లో ( 4 సిక్సర్లు, 5 ఫోర్లు) 62 పరుగులతో చెలరేగారు. కేవలం 10 ఓవర్లలో ఆర్సిబి 121/2 రన్స్ చేసింది. వీరిద్దరూ ఔట్ కావడంతో మళ్లీ బెంగళూర్ గెలుపు ఆశలకు బ్రేకులు పడ్డాయి.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి బెంగళూర్ 218 పరుగులు చేసింది. చైన్నై బౌలర్లలో తుషార్ దేశపాండే 3, పతిరణ రెండు వికెట్లతో చెలరేగారు. కెప్టెన్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీలతో విజృంభించారు.