
IPL 2023: బౌండరీలతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం.. చైన్నై భారీ స్కోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ దిగిన చైన్నై చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించింది. ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్ (3) పరుగులతో నిరాశపరిచాడు.
డెవాన్ కాన్వే, అంజిక్య రహానే, శివం దూబే ఆకాశమే హద్దుగా చెలరేగారు.
డెవెన్ కాన్వే 45 బంతుల్లో (ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) 83 పరుగులు, అంజిక్య రహానే 20 బంతుల్లో (రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు) 37 పరుగులు, శివందూబే 27 బంతుల్లో ( 2 ఫోర్లు, 5 సిక్సర్లు) 52 పరుగులతో చెలరేగారు.
సీఎస్కే
226 పరుగులు చేసిన చైన్నై సూపర్ కింగ్స్
చివర్లో అంబటి రాయులు 6 బంతుల్లో 14 పరుగులు, మెయిన్ అలీ 9 బంతుల్లో 19 పరుగులు చేశారు.
బెంగళూర్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, మాక్స్ వెల్, వేన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాఖ్, వానిందు హసరంగా, హర్షద్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు.
చైన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.