IPL 2023: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 145
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 34 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్,ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో రెండో బంతికి ఓపెనర్ ఫిలఫ్ సాల్ట్ ను ఔట్ చేసి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లను అత్యధిక సార్లు డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అటు తరువాత మిచెల్ మార్ష్(25) నటరాజన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుతిరిగాడు.
మూడు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్
సన్ రైజర్స్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో ఓవర్ రెండో బంతికే వార్నర్ (21) ను, నాలుగో బంతికి సర్ఫరాజ్ ఖాన్ (10) ను, చివరి బంతికి అమాన్ ఖాన్ (4) ను ఔట్ చేశాడు. దీంతో ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి 62 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో మనీష్ పాండే(34), అక్షర్ పటేల్(34) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ కుమార్ 2, టి.నటరాజన్ ఒక వికెట్ తీశారు.