చివరి డేవిస్‌కప్ ఆడనున్న బోపన్న
భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న డేవిస్‌కప్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో మొరాకోతో ప్రపంచ గ్రూప్-2 పోరును ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ అనంతరం డేవిస్‌కప్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు బోపన్న వెల్లడించారు. 2002 డేవిస్ కప్ అరంగ్రేటం చేసిన బోపన్న ఇప్పటివరకూ 32 మ్యాచులు ఆడారు. అయితే ఏటీపీ టూర్‌లో మాత్రం కొనసాగుతానని బోపన్న స్పష్టం చేశారు. 43 ఏళ్ల బోపన్న ఇప్పటికీ ఏటీపీ టూరలో బాగానే రాణిస్తున్న విషయం తెలిసిందే.
బెంగళూరులో మ్యాచును నిర్వహించలేమన్న ఏఐటీఏ
సెప్టెంబర్ లో తన చివరి డేవిస్ కప్ మ్యాచు ఆడాలనుకుంటున్నానని, మొరాకోతో పోరును తన సొంతగడ్డపై నిర్వహించాలని, ఇప్పటికే భారత ఆటగాళ్లందరితో మాట్లాడానని బోపన్న పేర్కొన్నారు. కర్నాటక టెన్నిస్ సంఘం కూడా ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉందని, ఇక మొరాకోతో పోరును బెంగళూరులో నిర్వహించాలా వద్దా అన్నది ఇక ఏఐటీఏ చేతుల్లో ఉందని బోపన్న చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచును బెంగళూరులో నిర్వహించలేమని ఇప్పటికే ఏఐటీఏ స్పష్టం చేసింది. బెంగళూరులో తన చివరి మ్యాచు ఆడాలని బోపన్న కోరుకోవడం మంచిదేనని, కానీ మొరాకోతో పోరుకు ఇటప్పటికే లఖ్‌నపూను వేదికగా ఖరారు చేశామని ఏఐటీఏ కార్యదర్శి అనిల్ ధూపర్ తెలియజేశారు.