Page Loader
Bray Wyatt Dead: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూత
Bray Wyatt Dead: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూత

Bray Wyatt Dead: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2023
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్ మృతి చెందాడు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సీఈఓ ట్రిపుల్ హెచ్ ధ్రువీకరించారు. అతి తక్కువ సమయంలో డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రే వ్యాట్, ది ఫైండ్ పేరుతో రెజ్లింగ్ చేసిన విండ్ హామ్ రోటుండా కేవలం 36 ఏళ్ల వయస్సులోనే మరణించడం శోచనీయం. బ్రే వ్యాట్ చాలాకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బ్రే వ్యాట్ మరణం గురించి అతని కుటుంబ సభ్యులు తమకు వెల్లడించినట్లు ట్రిపుల్ హెచ్ పేర్కొన్నాడు. ఈ సమయంలో ఆ కుటుంబానికి కావాల్సిన ప్రైవసీ ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ హెచ్ కోరాడు.

Details

బ్రే వ్యాట్ మృతిపై ది రాక్ సంతాపం

గురువారం (ఆగస్ట్ 24) రాత్రి బ్రే వ్యాట్ మృతి చెందినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రే వ్యాట్ మరణం తనను కలిచి వేసిందని, అతనిపై ఎప్పుడు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని, లెజెండ్ టెర్రీ ఫంక్ మరణవార్తను జీర్ణించుకునే లోపే బ్రే మరణించడం చాలా బాధేస్తోందని ది రాక్ చెప్పుకొచ్చాడు. బ్రే వ్యాట్ ఒకసారి WWE ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకోవడమే కాకుండా అతను రెండుసార్లు WWE యూనివర్సల్ టైటిల్‌ను కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. డబ్ల్యూడబ్ల్యూఈ రింగులో బ్రే వ్యాట్ చివరిసారి 2023 రాయల్ రంబుల్ లో తలపడ్డాడు.