Babar Azam : కోహ్లీ, బట్లర్, వార్నర్ రికార్డులు బద్దలు.. టీ20లో బాబర్ ఆజం చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబార్ అజామ్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించిన బాబర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్‌ల రికార్డులను అధిగమించాడు. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేరుకోవడానికి కోహ్లీకి 401 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యే వేళ, బాబర్ కేవలం 341 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు. ఇక వార్నర్ 435 ఇన్నింగ్స్‌లు, బట్లర్ 468 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను చేరుకున్నారు.
వివరాలు
అత్యంత వేగంగా 100 హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు
ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్నవారు బాబర్, కోహ్లీ, వార్నర్, బట్లర్ మాత్రమే. బాబర్ ఆజామ్ - 341 ఇన్నింగ్స్‌లు విరాట్ కోహ్లీ - 401 ఇన్నింగ్స్‌లు డేవిడ్ వార్నర్ - 435 ఇన్నింగ్స్‌లు జోస్ బట్లర్ - 468 ఇన్నింగ్స్‌లు
వివరాలు
71 పరుగులతో నాటౌట్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు 20 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. హసన్ నవాజ్ 37పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెషావర్ జల్మీ బౌలర్లలో మహమ్మద్ బాసిత్, సుఫియాన్ ముకీమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ఇఫ్తికార్ అహ్మద్ ఒక వికెట్ సాధించాడు. అనంతరం 155పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ జల్మీకి బాబర్ ఆజామ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 10 ఫోర్లతో 71 నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో పెషావర్ జల్మీ 18.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్వెట్టా బౌలర్లలో అల్జారి జోసెఫ్, సౌద్ షకీల్ చెరో వికెట్ తీసుకున్నారు.