Jasprit Bumrah: గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బుమ్రా.. శ్రీలంక సిరీస్‌లో ఆడటం ఖాయం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ నుంచి గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినప్పటికీ, ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తుది జట్టులో ఉంటాడని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందుగానే స్పష్టం చేసింది. తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బుమ్రా పూర్తిగా కోలుకున్నాడని, అన్ని ఫిట్‌నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాడని ప్రకటించింది. దీంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల్లోనూ అతడు బరిలోకి దిగడం ఖాయమైంది. బీసీసీఐ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. జస్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు.
వివరాలు
ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేసిన బుమ్రా
అన్ని ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేశాడు. ఇప్పటికే జట్టులో చోటు దక్కించుకున్న అతడు శ్రీలంకతో జరిగే రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారి తెలిపారు.
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా బుమ్రా గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో మూడో వన్డేకు అతడు దూరమయ్యాడు.
బుమ్రా లేని లోటు భారత బౌలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. అనుభవం తక్కువ ఉన్న భారత పేస్ దళంపై ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడి భారీ స్కోరు నమోదు చేయడంతో ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.
వివరాలు
శ్రీలంక టెస్టు సిరీస్‌లో బుమ్రా కీలకం
ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో బుమ్రా అందుబాటులో ఉండటం టీమ్‌ఇండియాకు భారీ ఊరటగా మారింది.
తుది జట్టులో ఇద్దరు ప్రధాన పేసర్లకే అవకాశం ఉండే పరిస్థితుల్లో బుమ్రా కీలక ఆయుధంగా నిలవనున్నాడు.
అతడు బరిలో ఉంటే శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌పై ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతేకాదు, గతంలో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు అత్యంత కీలకం.
వివరాలు
ఏడు మ్యాచ్‌లు గెలిస్తేనే ఫైనల్ చేరే అవకాశాలు
నాలుగో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భారత్‌కు ఇంకా తొమ్మిది టెస్టులు మిగిలి ఉన్నాయి. వీటిలో కనీసం ఏడు మ్యాచ్‌లు గెలిస్తేనే ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి.
శ్రీలంక సిరీస్ అనంతరం భారత్ న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో ఇక నుంచి ప్రతి మ్యాచ్ టీమ్‌ఇండియాకు ఎంతో కీలకంగా మారింది.
అలాంటి సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులో చేరడం భారత జట్టుకు భారీ బలాన్ని చేకూర్చింది.