Page Loader
Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా తరహాలోనే బుమ్రా.. చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తోన్న బీసీసీఐ
హార్దిక్ పాండ్యా తరహాలోనే బుమ్రా.. చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తోన్న బీసీసీఐ

Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా తరహాలోనే బుమ్రా.. చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తోన్న బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో తొమ్మిది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకోవడానికి బీసీసీఐకి ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఫిట్‌నెస్‌ గురించి బీసీసీఐ స్పష్టత ఇవ్వలేకపోయింది. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న బుమ్రాకు మరిన్ని స్కానింగ్‌లు అవసరమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే వెల్లడించాడు. కానీ బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. వైద్య బృందం మాత్రం నిరంతరం sబుమ్రాను పర్యవేక్షిస్తోందని మాత్రమే తెలిపింది.

Details

బుమ్రా ఫిట్‌నెస్‌పై సందిగ్ధత 

తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనం ప్రకారం, బుమ్రా ఎన్సీఏలో ఉన్నాడని, అప్పుడప్పుడు జిమ్ చేస్తూ, తక్కువ మోతాదులో బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్నాడని పేర్కొంది. గతంలో హార్దిక్‌ పాండ్య విషయంలో బీసీసీఐ ప్రదర్శించిన సహనాన్ని ఇక్కడ కూడా పాటిస్తోంది. హార్దిక్ వరల్డ్ కప్‌కు ముందు చివరి నిమిషం వరకు ఫిట్ అవుతాడని ఆశించి చివరికి ప్రసిధ్ కృష్ణను తీసుకున్నట్టు, ఇక్కడ కూడా బుమ్రాను చివరి నిమిషం వరకు చూడాలని భావిస్తోంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతడి స్థానంలో హర్షిత్ రాణా లేదా వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Details

మైదానాల నిర్వహణపై బీసీసీఐ అసంతృప్తి

ఇంగ్లండ్‌తో రెండో వన్డే మ్యాచ్ కటక్‌లోని బారాబాటి స్టేడియంలో జరిగింది. భారత ఇన్నింగ్స్ సమయంలో దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లడ్‌లైట్లు ఆగిపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో మైదానాల నిర్వహణపై బీసీసీఐ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది బీసీసీఐకి పెద్ద సవాలుగా మారగా, బుమ్రా ఫిట్‌నెస్‌పై త్వరలోనే స్పష్టత రానుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.