LOADING...
Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌కు బుమ్రా దూరం.. ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌కు బుమ్రా దూరం.. ఎందుకంటే?

Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌కు బుమ్రా దూరం.. ఎందుకంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్‌, యూఎస్‌ఏ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గాయాల సమస్యలు తలెత్తాయి. స్టార్‌ పేసర్‌ జస్పిత్ బుమ్రా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వాంఖడే స్టేడియంలో నిర్వహించిన టీమ్‌ఇండియా ట్రైనింగ్‌ సెషన్‌కు బుమ్రా హాజరుకాలేదని సమాచారం. దీంతో భారత జట్టు ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌గా ఉన్న 13 మంది ఆటగాళ్లతోనే యూఎస్‌ఏపై బరిలోకి దిగనుంది. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ ఇంకా జట్టుతో చేరలేదు. బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ కోసం అతడు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

Details

హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్

హర్షిత్‌ రాణా తప్పుకున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా మోకాలి గాయమైంది. దీంతో పేసర్‌ హర్షిత్‌ రాణా టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురవడమే ఇందుకు కారణం. స్కానింగ్‌ రిపోర్టులు, వైద్యుల నివేదికల ప్రకారం టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అతడికి తగిన ఫిట్‌నెస్‌ లేదని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ నిర్ధారించింది. రాణా త్వరగా కోలుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. హర్షిత్‌ రాణా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుమ్రా గైర్హాజరీలో తుది జట్టులో సిరాజ్‌కు అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement