Loading...
Auqib Nabi: బుమ్రా ఔట్‌.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు అకిబ్ నబీకి తొలి పిలుపు
బుమ్రా ఔట్‌.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు అకిబ్ నబీకి తొలి పిలుపు

Auqib Nabi: బుమ్రా ఔట్‌.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు అకిబ్ నబీకి తొలి పిలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో, అతని స్థానంలో అకిబ్ నబీ (Auqib Nabi)కి అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. 29 ఏళ్ల జమ్మూ కశ్మీర్‌కు చెందిన పేసర్ అకిబ్ నబీ, చాలాకాలంగా భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

వివరాలు

ఆగస్టు 15 నుంచి టెస్టు సిరీస్

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన నబీకి ఎట్టకేలకు జాతీయ జట్టులో అవకాశం లభించింది.

భారత్-శ్రీలంక (India vs Sri Lanka) మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది

. ఈ సిరీస్‌లో అకిబ్ నబీ ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రికెట్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT